తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచే ఇదే అంశంపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే టీఆర్ఎస్‌లో చాలా మంది తెలంగాణ భ‌విష్య‌త్ సీఎం కేటీఆర్ భ‌విష్య‌త్ తెలంగాణ సీఎం అంటూ ఓపెన్‌గానే ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇక కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ త‌న అనుచ‌రుల‌ను ప‌టిష్టం చేసుకుంటూ.. త‌న‌కంటూ ఓ టీం ఉండేలా ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక సీనియ‌ర్ నేత‌లు సైతం కేటీఆర్ ప్రాప‌కం కోసం పోటీ ప‌డుతున్నారు. భ‌విష్య‌త్తులో కేటీఆర్‌కు ద‌గ్గ‌రై మ‌రిన్ని కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టాల‌నుకున్న వారు కూడా కేటీఆర్ భ‌జ‌న చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే కేటీఆర్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టు టీఆర్ఎస్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తెలంగాణ రెండో ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ వ‌చ్చే నెల 18వ తేదీన ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు కేసీఆర్ ప‌లువురు పురోహితుల‌తో చ‌ర్చించి.. ఈ ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

కేటీఆర్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి ముందే కేసీఆర్ కొన్ని యాగాలు కూడా చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. యాగాల‌పై ఎంతో న‌మ్మ‌కం ఉన్న కేసీఆర్ త‌న కుమారుడు సీఎంగా పీఠం ఎక్కేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకే ఈ యాగాలు చేస్తున్నార‌ట‌. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం నిర్వహిస్తారని సమాచారం.

ఆ యాగాలు పూర్తయిన తర్వాత త‌న కుమారుడి సీఎం ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రిగే ప్ర‌ణాళిక‌లు ఆయ‌న ర‌చిస్తున్నార‌ట‌. కేటీఆర్ ప్ర‌మాణ స్వీకారానికి ముందు లేదా ఆ త‌ర్వాత హ‌రీష్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ల‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా నియ‌మించ‌నున్న‌ట్టు స‌మాచారం.  కేటీఆర్ సీఎం అయితే తెలంగాణ రాజ‌కీయాలు మ‌రోలా ట‌ర్న్ తీసుకోవ‌డం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: