ప్రస్తుతం ఎంతో మంది నిరుద్యోగులు విద్యా వంతులు ప్రభుత్వ ఉద్యోగులు సాధించడానికి ఇవి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగా లకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే శుభ వార్త చెప్పింది.  కేంద్ర ప్రభుత్వ పరిధి లోని వివిధ డిపార్ట్మెంట్లో పని చేయడానికి గ్రూప్ బి గెజిటెడ్,  నాన్ గెజిటెడ్,  గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యువేట్ లెవల్ పరీక్ష కు నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీంతో ఎంతో మంది నిరుద్యోగులు అప్రమత్తమయ్యారు.



 ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా.. సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటిలిజెన్స్ బ్యూరో,  సిబిఐ ,  రైల్వే, పోస్టల్,  ఇన్కమ్ తదితర విభాగాల్లో ఆఫీసర్లు అసిస్టెంట్లు ఇన్స్పెక్టర్లు మొదలైన సెంట్రల్ గవర్న మెంట్ ఉద్యోగా లను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగా లకు విద్యార్హత డిగ్రీ ఉంటే చాలు.  రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారం గానే నియామకాలు ఉంటాయి. ఇక అంతే కాకుండా ఉద్యోగాల నియామకాలు కోసం ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఏదైనా విభాగం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.



 ఇక దరఖాస్తు రుసుము 100 రూపాయలు.. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. తెలుగు రాష్ట్రా లలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://ssc.nic.in/ సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: