ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత బోండా ఉమ విమ‌ర్శ‌లు గుప్పించారు. .దేవాలయలపై దేవత విగ్రహాలపై దాడులు చేయిస్తూ గోవులకు పూజలు చేస్తే పాపం పోద్దా అని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో ఎప్పుడు దేవాలయలపై ఇన్ని దాడులు జరిగినట్టు చూడలేదన్న ఆయన.. వైసీపీ మద్దతుతోనే ఇన్ని దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇన్ని దాడులు జరిగినా పోలీసులు  ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. ఇది నిందితులకు వైసీపీ ఇస్తున్న మద్దతు కాదా  అని ఆయన ప్రశ్నించారు.

పోలీసులు గత ప్రభుత్వంలో సమర్థవతంగా పని చేయలేదా..  ఇప్పుడు ఎందుకు పని చేయటం లేదు  అని ఆయన ప్రశ్నించారు. డీజీపీ తాడేపల్లి ఆదేశాలతోనే దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అసలైన నిందితుల లిస్ట్ పోలీసుల దగ్గర వున్న వైసీపీ ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. హిందూ దేవాలయలలో కూడా మత మార్పిడులు చేస్తుండడం దారుణం కాదా అని ప్రశ్నించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలో విచ్చలవిడిగా మతమార్పిడులు పెరిగాయి వాస్తవం కాదా? అని నిలదీశారు.  

వైసీపీ పాలనలో కొందరు ఐపీఎస్‌లు వైపీఎస్‌‌లుగా మారారని ఆయ‌న ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై చాలా సార్లు కోర్టులు మొట్టికాయ‌లు వేసిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల గురించి ఐపీఎస్ లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తెలిపారు. అంతేగాక‌, సామాజిక మాధ్య‌మాల్లో స‌ర్కారు వైఫల్యాలను గుర్తు చేస్తూ పోస్టులు చేస్తే మాత్రం అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.పోస్టింగుల కోసం ప్రమోషన్లలో వైసీపీకి పోలీస్ సంఘం కొమ్ముకాస్తుందని విమర్శించారు.  స్వాతంత్రం వచ్చికా ఇన్ని సార్లు కోర్టు తప్పు పట్టిన పోలీసు వ్యవస్థను ఇప్పుడే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు.పోలీసులు న్యాయం కోసం పనిచేయాలి గాని ..ఇలా వైసీపీ కోసం కాదని బోండా ఉమా హితవుపలికారు.చట్టాలు తెలిసిన పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు




మరింత సమాచారం తెలుసుకోండి: