ఒక మనిషికి జీవితంలో ఒకసారే పెళ్లి చేసుకోవాలి.. అది జీవిత ధర్మం. మన దేశ సంప్రదాయం కూడా..కానీ ఇక్కడ ఓ యువకుడు ఏకంగా 11 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అతని వయసు మాత్రం 23 ఏళ్లే కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమ్మాయిలను మోసం చేస్తూ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. అతడి కన్నేసి ఏ అమ్మాయినైనా చిటికెలో బుట్టలో వేసుకుంటాడు. పెళ్లి చేసుకుని శారీరక వాంఛలు తీర్చుకున్నాక మొహం చాటేస్తాడు.



వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన తమిళనాడు చెన్నై లో వెలుగు లోకి వచ్చింది. ఇంతకీ అతడి వయసులో ఎంతో తెలుసా.. 23 సంవత్సరాలే.. రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన గణేష్ అనే యువకుడు కొలాత్తూర్‌కు చెందిన యువతి తో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఆ యువతిని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు.కూతురు కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ అత్తమామల నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అమ్మాయి అతడి తోనే ఉంటానని చెప్పడంతో ఆమె తల్లి దండ్రులు వదిలేసి వెళ్లిపోయారు.



తర్వాత కొద్ది రోజులకు అతడి నిజ స్వరూపం తెలిసి షాక్ అయ్యింది. తన పరిస్థితి గురించి ఇంటి యజమానికి చెప్పిన ఆమె అతడి సాయంతో పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులతో కలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్‌ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను ఇప్పటివరకు 11 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నానని, ఒకరికి తెలియకుండా మరొకరి తో సన్నిహితంగా ఉంటున్నానని చెప్పాడు. అతని వల్ల మోసపోయిన వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: