గతంలో తండ్రి వారసుడిగా తన కుమారుడిని మాత్రమే పరిగణించేవారు.. అతనికి మాత్రమే తన వ్యవహారాలు మరియు అధికారాలపై అన్ని హక్కులు ఉండేవి. సర్వ సృష్టి శ్రేష్టుడు అయిన పుత్రుడే అన్నింటికీ అర్హుడని అనుకునేవారు.... కానీ ఇప్పుడు కాలం మారింది కొడుకులతో పాటు, కుమార్తెలకు కూడా సమాన అధికారాలు లభిస్తున్నాయి. ఆస్తి పంపకంలో సైతం కుమారునితో పాటుగా కుమార్తెకు కూడా సమాన హక్కు కల్పించబడింది. ఇప్పుడు ఇదే తరహాలో స్త్రీలకు ప్రాధాన్యమిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.

సాధారణంగా ఇప్పటి వరకు జరిగిన సంఘ్టనలను బట్టి చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన పదవీ కాలం లోపల మరణిస్తే, సదరు ఉద్యోగం అదే కుటుంబంలో ఉన్న కుమారునికి లేదా ఒకవేళ పెళ్లి కాకుంటే కుమార్తెకు ఇస్తూ ఉండేవారు...అయితే ఇప్పుడు ఈ ఆపధతిని పూర్తియా మార్చే దిశగా అడుగులు పడుతుండడం గొప్ప విషయంగా పరిగణించవచ్చు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో కొడుకులతో పాటుగా పెళ్లైన కూతురిని కూడా సభ్యురాలిగానే చూడాలని అలహాబాద్ హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగి అయిన తన తండ్రి మరణిస్తే ఎలా అయితే తన తదుపరి కొడుకును ఆ బాధ్యతలు స్వీకరించడానికి  పరిగణిస్తారో అదేవిధంగా పెళ్లయిన కుమార్తెలు కూడా అర్హులని వెల్లడించింది హైకోర్టు.

పెళ్లయిన కొడుకైనా సరే... ఎలా అయితే కుటుంబ సభ్యుడిగా  భావిస్తారో అదే తరహాలో పెళ్లైన కుమార్తెను సైతం కుటుంబ సభ్యురాలిగా పరిగణించాలని మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఆర్డర్ ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీరి పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు సానుకూల తీర్పును వెల్లడించింది. పెళ్లైన కూతురు ఏదైనా అభ్యర్థిత్వానికి అనర్హురాలుగా చూడడం వివక్ష కిందకే వస్తుంది అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి ఇలా జరగడం సమంజసం కాదంటూ కొడుకుతో పాటు పెళ్ళైన కుమార్తెలకు సైతం సర్వాధికారాలు ఉంటాయని ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు...! దీనితో ఎంతోమంది వివాహిత అమ్మాయిలు ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: