భారత్ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంమైంది. ఈ వ్యాక్సిన్ ప్రక్రియని వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రధాని ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ లు ప్రారంభించారు. తెలంగాణలో మొదటి వ్యాక్సిన్ ని గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారిగా పని చేస్తున్న కృష్ణమ్మ అనే మహిళ మొదటి టీకా వేసుకుంది. దీంతో తెలంగాణలో మొదటి కరోనా టీకా వేసుకున్న మొట్ట మొదటి వ్యక్తిగా కృష్ణమ్మ రికార్డుల్లోకి ఎక్కింది. 

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏపీ సీఎం  వైయస్ జగన్ ప్రారంభించారు. ఇక రాష్ట్రంలో మొదటి వ్యాక్సిన్ ని కూడా సఫాయి కర్మచారిగా బి పుష్ప కుమారికి వేశారు వైద్య సిబ్బంది.  ఈరోజు భారతదేశవ్యాప్తంగా కరో నాటిక వ్యాక్సినేషన్ ప్రారంభమయింది.  ఈరోజు దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు సుమారు మూడు లక్షల మంది వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందనుంది. 

ఇక ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం అని వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం మోడీ పేర్కొన్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం చాలా ఎదురు చూసిందని, వ్యాక్సిన్ రూపకల్పన కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించారు అని మోడీ పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తల కృషి వల్ల రెండు దేశీయ వ్యాక్సిన్లు ఆవిర్భవించాయని మరికొన్ని భారతీయ వ్యాక్సిన్ లు  కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: