ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్  ప్రారంభమైంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపి నామా నాగేశ్వరరావు, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ తప్సీర్ ఇక్బాల్ ప్రారంభించారు. మొదటి టీకా హెడ్ నర్స్ మేరీ కి వేశారు. సత్తుపల్లి, బోనకల్, మధిర, ఖమ్మం నగరంలోని యుపిఎస్ లో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ రావటం సంతోషం అని అన్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత దేశంలో ఏలా కట్టడి చేస్తుందా ఎదురు చూశారు అని ఆయన పేర్కొన్నారు.

ప్రజలను వ్యాక్సిన్ వచ్చే వరకు‌ కాపాడుకున్నాం అని ఆయన తెలిపారు. దేశంలో రెండు వ్యాక్సిన్లు రావటం సంతోషం అని ఆయన పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్  అందిస్తామని చెప్పారు. ప్రాణాలను కాపాడి ఖమ్మం జిల్లాకు పేరు తెచ్చారు అని అన్నారు. జిల్లా ప్రజలు తరువాతే ప్రజాప్రతినిధులకు టీకా అని ఆయన స్పష్టం చేసారు. భారత్ బయోటెక్ తెలుగు గడ్డ మీద తయారు కావటం సంతోషకరం అని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడు లక్షల మందికి 15975 మందికి ఖమ్మం జిల్లా లొ వారియర్స్ కి వ్యాక్సిన్ అందిస్తామని చెప్పారు.

తొలి ఆరు సెంటర్స్ ఆ తరువాత 36  సెంటర్స్ ద్వారా వ్యాక్సిన్ అందిస్తాం అని అన్నారు.  ఇప్పటికి 153  వాయిల్స్ వచ్చాయి అని అన్నారు. పిహెచ్ సి సెంటర్లను గుర్తించాం అని ఆయన తెలిపారు. ఎక్కడా దుర్వినియోగం జరగదు అని అన్నారు. గత 9 నెలలుగా భయానిక వాతావరణం అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు సంచార కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం అని అన్నారు. అతి తక్కువ మరణాలతో కోవిడ్ నుండి కాపాడుకున్నాం అని తెలిపారు. మా ఫౌండేషన్ ఎన్ జివో ఆర్గ నైజేషన్ లు ముందుకు రావాలి. ఉచిత వ్యాక్సినేషన్ అందజేయాలి అని, నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: