ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నేటి నుండి వ్యాక్సినేషన్ కు శ్రీకారం చుట్టడంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ సరఫరా అయిన రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ మొదలుపెట్టాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణ ప్రజల్లో కొంత భయాలు ఉన్నాయి. టీకా వేసుకుంటే ఏమైనా అవుతుందేమోనని వారు భయపడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. వారిలో భయం పోగొట్టడానికి నేను  ముందుకువచ్చానని . అందుకు నేను కూడా రెడీఅయి  తొలి టీకా నేనే తీసుకుంటా.’ అని మంత్రి ఈటల ఇదివరకే ప్రకటించారు.కానీ తాను మాత్రం ఈ రోజు వ్యాక్సిన్ ను తీసుకోలేదు.


ప్రాణాలకు తెగించి డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనాపై యుద్ధం చేశారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రాణ త్యాగం కూడా చేశారని గుర్తు చేశారు .ముందు వారికే  వాక్సిన్ అందించాలని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మకు అందించామని  .. .తాను ఈ రోజు వ్యాక్సిన్ తీసుకోలేక పోవడానికి కారణం అదేనని ప్రకటించారు. ప్రజలు అనవసర భయాలు పెట్టుకోవద్దని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ రావటం దేశానికి శుభ పరిణామం అని పేర్కొన్నారు తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ .కోవిడ్ టీకా వచ్చింది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కోవిడ్ టీకా తీసుకున్న కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత  కూడా సరైన  జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాలన్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోషల్ డిస్టెన్స్   పాటించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: