ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లకపోవడంతో సీఎం జగన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో కూడా పాల్గొనకపోవడం వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది. కొంత మంది నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా వివాదాస్పదం వ్యవహరిస్తున్నారు.

నియోజకవర్గ ఇన్చార్జిలకు అలాగే ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలతో కొంతమంది నేతలు సన్నిహితంగా ఉండటం కూడా ఇప్పుడు నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా మారిన అంశంగా చెప్పుకోవాలి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీన పరిచే విధంగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తూ ఉంటే... కొంతమంది నేతలు మాత్రం తెలుగుదేశం నేతలతో సావాసం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల కారణంగా నియోజకవర్గం ఇంచార్జ్ లు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

పార్టీలో ముందునుంచి ఉన్న కొంతమంది కీలక నేతలు ఇప్పుడు పార్టీ మారాలి అని భావించడానికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణం అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీతో వాళ్ళు సావాసం చేస్తున్నారని వారు తెలుగుదేశంలోకి చేరే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు సరిగా పని చేయకుండా ఉండటమే కాకుండా నియోజకవర్గ ఇన్చార్జిలను కూడా ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం సమర్థవంతంగా పని చేయలేక పోతే మాత్రం పార్టీ ఘోరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కాస్త కఠినంగా వ్యవహరించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని కొంతమంది ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్ళినట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: