తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలామంది పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది నేతలు పదేపదే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని వార్తలు ఈ మధ్యకాలంలో వినపడుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేని చాలా మంది నేతలు ఇప్పుడు పదవుల కోసం భారతీయ జనతా పార్టీ లోకి వెళ్తున్నారు అని టాక్. భారతీయ జనతా పార్టీ కచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

అందుకే బీజేపీ వైపు కొంతమంది కీలక నేతలు చూడటంతో సీఎం కేసీఆర్ కూడా ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారు. నల్గొండ జిల్లాలో కూడా కొంతమంది నేతలు బీజేపీ వైపు చూడటంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ చర్యలకు దిగినట్టుగా సమాచారం. బీజేపీ లోకి వెళ్ళాలి అని భావిస్తున్న నేతలకు ఆయన మంత్రి పదవులను కూడా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాకుండా కీలక నేతలు అయితే వాళ్లకు బలగం ఎక్కువగా ఉంటే వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుట్టుగా తెలుస్తుంది. ఇక బిజెపి బలంగా ఉన్న ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో విషయంలో సీఎం కేసీఆర్ కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి విషయంలో దూకుడుగా వెళ్లకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే విధంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లోకి అవకాశం కల్పిస్తామని ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో  పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఈ పరిణామాలు మాత్రం టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: