విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వాక్సినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం  వైయస్ జగన్ సమక్షంలో పలువురికి వ్యాక్సిన్ వేసారు. రాష్ట్రంలో తొలిగా సానిటరీ వర్కర్ బి పుష్ప కుమారి కి కరోన వ్యాక్సిన్ వేసారు వైద్య సిబ్బంది. పుష్పకుమారికి 0.5 మిల్లి డోసుల వాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ భద్రపరిచిన క్యారియర్ బాక్సులను పరిశీలించిన సీఎం జగన్... పలు సూచనలు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో కేంద్రంలో వందమందికి చొప్పున వ్యాక్సినేషన్ వేస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 87 983 మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలో తొలి టీకా గ్రహీత, ఆశా వర్కర్ ఏ. సాయి లక్ష్మి మాట్లాడుతూ... తొలి టీకా తనకు దక్కడం ఎంతో గర్వంగా వుంది..సంతోషంగా వుంది అని ఆమె వెల్లడించారు. టీకా వేసుకోడానికి ఎవ్వరూ భయపడక్కర్లేదు అని సూచించారు. టీకా వేసుకున్న తర్వాత  జాగ్తత్తలు తప్పనిసరి. మస్కు,  శానిటైజర్లు వాడాల్సిందే అని ఆమె స్పష్టం చేసారు. తానిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను అని అన్నారు. యధావిధిగా రేపటి నుంచి విధుల్లో వుంటాను అని స్పష్టం చేసారు.

28 రోజుల తర్వాత రెండో డోస్ తప్పనిసరిగా వేసుకుంటాను అని అన్నారు. నరసరావుపేట లో స్వయంగా వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసారు ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి. పొన్నెకల్లు లో స్వయంగా వైద్య సిబ్బంది కి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వ్యాక్సిన్ వేసారు. గుంటూరు నగరంలో వ్యాక్సిన్ పంపిణీని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. నాదెండ్ల లో వ్యాక్సిన్ పంపిణీని ఎమ్మెల్యే విడదల రజనీ ప్రారంభించారు. వినుకొండ లో వ్యాక్సిన్ పంపిణీని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ప్రారంభించారు. అయితే వ్యాక్సిన్ ని అందించే  క్రమంలో కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు అధికారులకు తల నొప్పిగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: