మొదటి విడతలో పెండింగ్ లో ఉన్న గొర్రెల యూనిట్ల పంపిణి కార్యక్రమాన్ని నల్గొండలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... చరిత్రలో ఏ నాయకుడు చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారు అని అన్నారు. గొర్రెల పంపిణీ పథకం గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసింది అని వెల్లడించారు.

గతంలో తెలంగాణలో మాంసం దిగుమతులు వచ్చేవి అని ఆయన అన్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది అని తెలిపారు. వచ్చే బడ్జెట్ లో రెండో విడత గొర్రెల పంపిణీకి నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు అని ఆయన తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ చెప్తే అది చట్టం చేసినట్టే అని అన్నారు. సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన వెల్లడించారు. ఒక్కో యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలను అర్హులందరికీ అందిస్తున్నాం అని అన్నారు.

గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల కుళ్లు రాజకీయాల్లో  పడి కుల సంఘాలు ఆగం ఆగం కావొద్దు అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలు, అన్ని కులవృత్తులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి అని ఆయన తెలిపారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతిపక్షాలు మర్యాద లేకుండా  మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నాయి అని విమర్శించారు. ఉమ్మడి నల్గొండలో సాగు నీటి ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయి అని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బంది ఎదురైన నష్టపోయేది ప్రజలే అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: