తిరుపతి ఉప ఎన్నికల నేపధ్యంలో... తిరుపతి పార్లమెంటు టిడిపి నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న టిడిపి క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, సమన్వయకర్తల అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. వైసిపి దుర్మార్గాలపై ప్రజా తీర్పుకు తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్ష లాంటిది అని అన్నారు. వైసిపి అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు ఇదొక అవకాశం అని ఆయన పేర్కొన్నారు. గత 20నెలలుగా వైసిపి దుర్మార్గాలను ఎక్కడికక్కడ నిగ్గదీశాం. బాధిత వర్గాల ప్రజలకు అండగా ఉన్నాం అని వెల్లడించారు.

 బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులను నిరసించాం అని తెలిపారు. వీరోచిత పోరాటం చేసేవాళ్లకే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. అనపర్తి, విశాఖ ఈస్ట్, గురజాల, తంబళ్లపల్లి, పొద్దుటూరు ఉదాహరణ అని వెల్లడించారు. వైసిపి దుర్మార్గాలపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. అన్నివర్గాల ప్రజలు కసిగా వస్తున్నారు, యువత వస్తున్నారు అన్నారు.  రామతీర్ధం పర్యటనకు హాజరైన ప్రజలు...నిన్న భోగిమంటలకు హాజరైన ప్రజలు..వైసిపి పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అని చంద్రబాబు వెల్లడించారు.
 
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో భోగిమంటల్లో వైసిపి రైతు వ్యతిరేక జీవోల దగ్దం చేశారు అని తెలిపారు.  రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాం. 0.25% అప్పుల కోసం రైతులు, పేదలపై పన్నుల భారాలు మోపడాన్ని గర్హించాం అని పేర్కొన్నారు. రూ 70వేల కోట్ల పన్నులు వేశారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు అని మండిపడ్డారు.  150దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారు అన్నారు. ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదు, ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగిరోజున డిజిపినే చెప్పారు అని విమర్శించారు.

ఇప్పుడు డిజిపి మళ్లీ కనుమ రోజున మాటమార్చి దీనిని ప్రతిపక్షాలకు అంటగడ్తున్నారు అని విమర్శించారు.  17మంది టిడిపి, 4గురు బిజెపి వాళ్లను అరెస్ట్ చేసినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఎవరైతే దాడులు చేశారో వాళ్లను వదిలేసి, వాటిని నిలదీసిన వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు అని విమర్శించారు.  భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు లేవు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.  విగ్రహాల తలకొట్టడం, వనదేవతలను కాలితో తన్నడం తమ మత ప్రచారంలో భాగమని ప్రచారకులే చెబుతుంటే ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: