ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడుల విషయంలో తీవ్ర స్థాయిలో విపక్షాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి నేతలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... పోలీసు శాఖ, వైసిపి మంత్రులపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విగ్రహాల ద్వంసం కేసులో బిజెపి నేతలు ఉండారని డిజిపి సవాంగ్ చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాష్ట్రంలో  పోలీసులు వైసిపి పార్టీకి కార్యకర్తలుగా  వ్యవహరిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. మొదట సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్న వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయండి అని డిమాండ్ చేసారు.

చేతనైతే పోలీసులు విగ్రహలను, దేవాలయాలను ద్వంసం చేయడానికి పరోక్షంగా   రెచ్చగొట్టిన  కొడాలి నాని నీ వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. పోలీస్ సంఘాల నాయకులు
కొందరు పోలీస్ సంక్షేమం గాలికొదిలేసి కొందరు అధికారుల తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేసారు. ఓ ఫాస్టర్ స్వయంగా విగ్రహాలను ద్వంసం చేశానని బహిరంగంగా పోలీసులకు ప్రభుత్వానికి చాలెంజ్ విసురుతున్నాడు అని విమర్శించారు. ఆ ఫాస్టర్ వైసిపి నేతలతో తిరుగుతున్నాడు అని అన్నారు.

మరి అతను వైసిపి కాదా పోలీసులు సమాదానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. కొందరు పాస్టర్లు పై  చర్యలు తీసుకోకుండా పోలీస్ మరియు ప్రభుత్వం నిందితులక  అండగా నిలుస్తోంది అని అన్నారు. ముఖ్యమంత్రి గానీ, హోం మంత్రి గానీ విగ్రహాల ద్వంసం విషయంలో నోరు మెదకపోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవాలయాలను పరిరక్షించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది అని ఆయన ఆరోపించారు. డిజిపి 48 గంటల వ్యవధిలోనే మాట మార్చి ప్రకటనలు చేస్తున్నాడు అని ఆయన విమర్శలు చేసారు. దీని వెనుక ఏవరి హస్తం ఉందో  ప్రజలకు తెలుసు అని అన్నారు ఆయన. 

మరింత సమాచారం తెలుసుకోండి: