మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. సత్యహరిశ్చంద్రుడి కుటుంబం నుంచి వచ్చినట్లు విజయసాయిరెడ్డి ప్రతి నియోజకవర్గం వెళ్లి టిడిపి నేతల పై ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. నువు మాట్లాడేటప్పుడు జిల్లాలో ఎవరు ఏమిటో తెలుసుకొని  మాట్లాడాలి అని సూచించారు. మాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. నీ లాగ గాలి లోంచి రాలేదు అని అన్నారు. వాడచీపురుపల్లి లో సర్వే నెంబర్ 464 లో ఉన్న ప్రభుత్వ భూమి 1995 నుండి వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు మీ పార్టీ ఎమ్మెల్యే అదీప్ రాజే స్వయానా చెప్పారు అని మండిపడ్డారు.

ఇది వృద్ధాశ్రమం కోసమో విద్యాభివృద్ధి కోసమో కాదు చేపల వ్యాపారం కోసం ఎమ్మెల్యే స్వాధీనంలో భూమి ఉంది అని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే అదీప్ రాజు కి కొండ మీద పట్టా ఎలా వచ్చింది అని నిలదీశారు. కొండ పై ఎమ్మెల్యే అదీప్ రాజు నిర్మించిన గెస్ట్ హౌస్ ఇప్పుడు కూలుస్తారా లేదో విజయసాయిరెడ్డి చెప్పాలి అని సవాల్ చేసారు. సముద్ర ఇసుకను సైతం ఎమ్మెల్యే అదీప్ రాజు అక్రమంగా తరలిస్తున్నారు అని అన్నారు. మీ పార్టీకి చెందిన నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు నా దగ్గర ఉన్నాయి అని ఆయన అన్నారు.

వాళ్ళు  నా గురించి మాట్లాడలేదు కాబట్టి  నేను వాళ్ల గురించి మాట్లాడను గురించి మాట్లాడను అని ఆయన పేర్కొన్నారు. నువ్వు మాత్రం బురద జల్లుతున్నవ్ అని విమర్శించారు. దొంగతనం చేశాను కానీ నేను దొంగను కాను అంటున్నారు ఎమ్మెల్యే అదీప్ రాజు అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే అదీప్ రాజు స్వాధీనంలో ఉన్న దానిపై వస్తున్న శనివారం లోగా యాక్షన్ తీసుకుంటే తీసుకుంటే మీడియా ముందుకు వచ్చి మీకు థాంక్స్ చెప్తాను అని అన్నారు. మీరు యాక్షన్ తీసుకోకపోతే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మీ వాళ్ళ బండారం బయట పెడతా అని అన్నారు. సత్య హృశ్చంద్రుడు బ్రతికి ఉంటే నాతో వీళ్ళకు పోలిక అంటూ ఆత్మహత్య చేసుకునేవాడు అని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: