తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ-జనసేన పార్టీలు ఓ అవగాహన వచ్చినట్లు కనిపించడం లేదు. తిరుపతిలో జనసేన మద్ధతుతో తామే పోటీ చేస్తున్నామని బీజేపీ ముందే ప్రకటించేసింది. అలాగే తిరుపతి ఉప ఎన్నిక కోసం కమిటీలు కూడా నియమించుకుని ముందుకెళుతుంది. అయితే ఈ విషయంలో జనసేన కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

తిరుపతి బరిలో తాము ఉంటామని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇలా ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నా సరే సరైన అవగాహనతో లేరని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీలు అభ్యర్ధులని ప్రకటించేశాయి. ఆ పార్టీలు రేపో మాపో ప్రచారం కూడా మొదలుపెట్టనున్నాయి. కానీ బీజేపీ-జనసేనల్లో ఏ పార్టీ పోటీ చేస్తుందో క్లారిటీ లేదు. ఈ రెండు పార్టీల్లో ఎవరు పోటీ చేసినా, తిరుపతి బరిలో అసలైన పోటీ మాత్రం టీడీపీ-వైసీపీల మధ్యే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

అలాగే గెలుపు విషయంలో అధికార వైసీపీ ఓ అడుగు ముందే ఉందని సంగతి కూడా తెలిసిందే. అయితే టీడీపీ ఏ మేర పోటీ ఇస్తుంది. వైసీపీ మెజారిటీ ఎంతవరకు తగ్గిస్తుందనేదే మేటర్. అయితే ఇక్కడ పవన్, టీడీపీకి ప్లస్ అవుతారని తెలుస్తోంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జనసేన పోటీలో ఉంటే ఆ ఓట్లు కొంతవరకు, ఆ పార్టీకే పడతాయి. దీని వల్ల వైసీపీ మెజారిటీ తగ్గుతుంది.

ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీ పోటీలో ఉంటే, వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ పోటీలో ఉంటే, అక్కడ ఉండే కాపు ఓటింగ్ పడటం కష్టం. బీజేపీ ఎలాగో గెలవదని చెప్పి, వారు వైసీపీ వైపు వెళ్తారని తెలుస్తోంది. దాంతో వైసీపీ మెజారిటీ పెరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లైతే జనసేన పోటీలో ఉంటే టీడీపీకే ప్లస్ అవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: