గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని చెప్పి, టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే పరిటాల ఫ్యామిలీ నుంచి సునీత పోటీ చేయకుండా, తన తనయుడు శ్రీరామ్‌కు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఇక రాప్తాడు బరిలో నిలిచిన శ్రీరామ్, వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇలా ఘోరంగా ఓడిపోవడం, పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో పరిటాల ఫ్యామిలీ సైలెంట్ అయింది.

అయితే మధ్యలో రాప్తాడు పక్కనే ఉన్న ధర్మవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో, ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా చంద్రబాబు, పరిటాల ఫ్యామిలీకే అప్పగించారు. దీంతో పరిటాల ఫ్యామిలీ రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు చూసుకుంటుంది. ఇలా పరిటాల ఫ్యామిలీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చేసింది. నెక్స్ట్ ఎన్నికల్లో సునీత, శ్రీరామ్‌లు రాప్తాడు, ధర్మవరం బరిలో ఉంటారని, టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

అయితే ఆఫర్ అయితే వచ్చింది గానీ, ఆ ఆఫర్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికీ రెండు నియోజవర్గాల్లో పరిటాల ఫ్యామిలీ పుంజుకున్నట్లు లేదు. రాప్తాడులో వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి బాగానే పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. ఇక ధర్మవరం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హవా నడుస్తోంది.

ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రతిరోజూ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలని అక్కడిక్కడే పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. సమస్యలు కూడా తీరుస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉన్న టీడీపీ అభిమానులు సైతం కేతిరెడ్డికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్తితి చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలుపు కష్టమే. కాస్తో కూస్తో రాప్తాడులోనే పరిటాల ఫ్యామిలీకి అవకాశం ఉండేలా కనిపిస్తోంది. ఇక్కడ కొద్దిగా కష్టపడితే నెక్స్ట్ ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీ గెలవచ్చని తెలుస్తోంది. మొత్తానికైతే పరిటాల ఫ్యామిలీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: