ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా భయపెట్టిందో వేరే చెప్పాలా? అయితే అమెరికన్ కంపెనీ ఫైజర్, ఆ తర్వాత మోడెర్నా, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇలా ఒక్కో సంస్థా కరోనాకు వ్యాక్సిన్ తీసుకు రావడంతో ఈ భయం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ వ్యాక్సిన్లు ఇకపై మనకు కరోనా రాకుండా అడ్డుకుంటాయని ఏ సంస్థా హామీ ఇవ్వక పోవడం కొంచెం ఆందోళన కలిగిస్తున్న మాట మాత్రం నిజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీలు అందించిన వ్యాక్సిన్ వల్ల వచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు.

అయితే వీటిలో ప్రపంచం ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫైజర్ టీకాకు భారత్‌ లో చుక్కెదురైంది. దీనికి ఆమోదం ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రపంచంలో పెద్ద దేశాలన్నీ వ్యాక్సినేషన్లు చేస్తుంటే మనం మాత్రం ఇంకా కరోనా భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. అయితే ఈ విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించాలని అనుకున్న భారత్.. అనుకున్న విజయం సాధించింది. కరోనాకు సొంతగా వ్యాక్సిన్లు తయారు చేసింది. ఈ క్రమంలో శనివారం నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పారంభించారు. ఈ క్రమంలో గుంటూరులో కూడా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లకు కరోనా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఇక్కడో వింత దృశ్యం అందరినీ ఆకర్షించింది. అదేంటంటే.. ఓ ఎమ్మెల్యే కొంత మందికి టీకా వేయడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డాక్టర్‌గా మారిపోయారు. పొన్నెకల్లులో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఓ మహిళకు ఎమ్మెల్యే కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. ఎమ్మెల్యే స్వయానా డాక్టర్ కావడంతో ఆమె ఇలా వ్యాక్సిన్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: