ఆంధ్రప్రదేశ్ లో బలపడి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ కి ఆదిలోనే హంసపాదు అన్నట్లు సోము వీర్రాజు రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.. కొన్ని రోజుల కిందటే బీజేపీ సోము వీర్రాజు కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష్య పదవి ని అప్పగించింది.. అయితే తన చర్యలతో, అతుత్సహంతో సోము వీర్రాజు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడమే కాకుండా ఇప్పటికే ఉన్న అనుకూలతను పోగొట్టాడని పార్టీ లోని కొంతమంది నేతలు చెప్తున్నారు. అయన ఆత్రానికి హద్దే లేకుండా పోతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోము వీర్రాజు ఈ విమర్శలను ఎలా తిప్పికొడతాడో చూడాలి..

పార్టీ ని బలోపేతం చేయడానికి అయన చేసిన చర్యలు బెడిసికొట్టాయి. మొదట్లో కొంత ప్రభావం చూపినా ఇప్పుడు ఎందుకో సోము వీర్రాజు ప్లాన్ లు ఏవీ వర్క్ కావట్లేదు.. అవి విఫలం అయ్యి నవ్వుల పాలు అవుతున్నారు.  ఇటీవలే టీడీపీ మాజీ అధ్యక్షుడు కళావెంకట్రావు ను కలుస్తున్నాను అని బహిరంగంగానే చెప్పాడు సోము వీర్రాజు..  అయన ను కలిసి బీజేపీ లోకి వచ్చే విషయం తేల్చేస్తానని చెప్పి టీడీపీ కి షాక్ ఇచ్చాడు కూడా అయితే వెంకట్రావ్ నుంచి అందరు ఊహించిన సమాధానం అయితే రాలేదు. కోపం వచ్చినా గౌరవంగానే… సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు. వెంటనే సోము వీర్రాజు..కళా వెంకటరావును తాను కలవడం లేదని  పొరపాటున ఆయన పేరును చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.

ఈ విధంగా ముందొకమాట, వేనుకొకమాట చెప్పి పార్టీ పరువును గంగలో కలిపెస్తున్నాడు. తను అధ్యక్షుడు అయ్యేటప్పుడు పెద్ద పెద్ద వారిని పార్టీ లోకి తీసుకొస్తా అని మాట ఇచ్చాడేమో కానీ ఆయన అదే పనిగా… ఇతరుల్ని కలవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరికి చెన్నై వెళ్లి వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌ను కలవాలనుకున్నారు. ఇద్దరూ అంగీకరించినా.. చివరికి సోము వీర్రాజు చెన్నై వెళ్లిన తర్వాత ప్రియారామన్ హ్యాండిచ్చారు. వాణివిశ్వనాథ్ ఏమీ చెప్పకుండా పంపేశారు. ఇలా అన్నీ సగం సగం పనులు చేస్తూ సోము వీర్రాజు ను ఎందుకు అధ్యక్షుడిగా చేశాము అన్న ఫీలింగ్ ను పార్టీ అధిష్టానంలో కలిగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: