తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. రాజకీయంగా రేవంత్ రెడ్డి  కాస్త బలంగా ఉన్న నేత కావడం ఆయనకు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ఉండటంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. రేవంత్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే కొంతమంది కీలక సీనియర్ నేతలు కూడా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని వీడటంతో... పార్టీ ఎక్కువ ఇబ్బందులు పడుతోంది.

రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న నేతలలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో ఉన్న నేతలను బుజ్జగించే కార్యక్రమాలు చేస్తోంది. జానారెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావించిన సరే కొన్ని పరిణామాల కారణంగా అది సాధ్యం కాలేదు. నాగార్జునసాగర్ ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం కూడా జరిగింది.

ఆ పదవిని కూడా కొంతమంది సీనియర్ నేతలు అడగడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాస్త ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి కి ఏ పదవి ఇవ్వకుండా 2023 ఎన్నికల నాటికి ఆయనకు పదవి అప్పగించాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉందని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి కి ఏ పదవి ఇవ్వకుండా పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ కొంతమంది నేతలు వద్ద వ్యక్తం చేశారట. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గానీ రేవంత్ రెడ్డి కి పదవి ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి  అనేదానిపై అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: