కోల్‌కతా: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా భయపెట్టిందో వేరే చెప్పాలా? అయితే అమెరికన్ కంపెనీ ఫైజర్, ఆ తర్వాత మోడెర్నా, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇలా ఒక్కో సంస్థా కరోనాకు వ్యాక్సిన్ తీసుకు రావడంతో ఈ భయం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ వ్యాక్సిన్లు ఇకపై మనకు కరోనా రాకుండా అడ్డుకుంటాయని ఏ సంస్థా హామీ ఇవ్వక పోవడం కొంచెం ఆందోళన కలిగిస్తున్న మాట మాత్రం నిజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీలు అందించిన వ్యాక్సిన్ వల్ల వచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు. అయితే వీటిలో ప్రపంచం ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫైజర్ టీకాకు భారత్‌ లో చుక్కెదురైంది. దీనికి ఆమోదం ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రపంచంలో పెద్ద దేశాలన్నీ వ్యాక్సినేషన్లు చేస్తుంటే మనం మాత్రం ఇంకా కరోనా భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. అయితే ఈ విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించాలని అనుకున్న భారత్.. అనుకున్న విజయం సాధించింది. కరోనాకు సొంతగా వ్యాక్సిన్లు తయారు చేసింది. ఈ క్రమంలో శనివారం నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తగినన్ని కోవిడ్-19 టీకాలు పంపించాలని కేంద్ర ప్రభుత్వానికిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. కేవలం అత్యవసర సేవల సిబ్బందికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి టీకా అందించాలని, దానికి ఏమైనా ఖర్చు అయితే తాము భరిస్తామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు విలువైనవేనని, ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా కోవిడ్-19 టీకా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు.

శనివారం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము కేంద్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రానికి సరిపడా కోవిడ్-19 టీకాలను పంపించండి. అత్యవసర సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత టీకా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరి ప్రాణాలు విలువైనవే. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత టీకా వేసే విషయంలో అవసరమైన ఖర్చుల్ని మేము భరతిస్తాం’’ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: