అసలు సిసలైన కార్యదక్షతకు చైనా మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఒకసారి అనుకుంది  అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి  చూపెడుతూ ఉంటుంది చైనా. గతంలో చైనాలో కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో కేవలం రోజుల వ్యవధిలోనే చూస్తుండగానే అతి పెద్ద ఆసుపత్రి నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది అనే విషయం తెలిసిందే. ఇలా ఎంతో పట్టుదల కార్యదీక్ష తో కేవలం రోజుల వ్యవధిలోనే... అనుకున్న పని చేసి చూపిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది చైనా.  ఇది ఇటీవలే మరో సారి నిరూపిస్తూ చైనా తన సత్తా చాటింది. గతంలో కేవలం రోజుల వ్యవధిలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆసుపత్రి నిర్మించింది. కానీ ప్రస్తుతం మరో కార్యాన్ని తల పెట్టి పూర్తి చేసింది.




 మొన్నటి వరకు చైనాలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ ప్రస్తుతం చైనాలో కరోనా  వైరస్ కేసులు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో కరోనా  వెలుగులోకి వచ్చినప్పుడే చైనాలో భారీగా మరణాలు సంభవించాయి ఇక ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు కరోనా  వైరస్ ను సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు అప్రమత్తం అయ్యింది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇటీవల కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే భారీ ఆసుపత్రిని నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.



 కేవలం ఐదు రోజుల సమయం లోనే 1500 గదులు ఉన్న ఒక అతి పెద్ద ఆసుపత్రి నిర్మించింది చైనా. ప్రస్తుతం హెబేయ్  ప్రావిన్స్ లోని న్యాంగాంగ్  ఈ తరహా ఆసుపత్రులను ఆరు  నిర్మించింది. అయితే ప్రస్తుతం న్యాంగాంగ్ లో  ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా  దేశవ్యాప్తంగా పాకి  పోకుండా ఉండడానికి.. న్యాంగాంగ్ లో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది చైనా ప్రభుత్వం. అదే సమయంలో శరవేగంగా ఆసుపత్రులు నిర్మిస్తూ కరోనా  వైరస్ బారిన పడిన రోగులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు నిర్ణయించింది. ఏదేమైనా అయిదు రోజుల్లోనే 1500 గదులు  ఉన్న ఆసుపత్రి నిర్మించడం మాత్రం చైనా కే సాధ్యం అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: