ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన స్వింగ్ బౌలింగ్ తో ఆసిస్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెడుతున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్ పై క్రికెట్ సీనియర్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా తాజాగా క్రికెట్ దిగ్గజం. మాస్టర్ బ్లాస్టర్  సచిన్ టెండూల్కర్ కూడా సిరాజ్ స్వింగ్ బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. పిచ్ పరిస్థితితో సంబంధం లేకుండా బంతిని రెండు వైపులా నాట్యం చేయిస్తున్నాడంటూ ఈ హైదరాబాదీ పేసర్ ను సచిన్ ప్రశంసించాడు. అంతేకాదు, సిరాజ్ ప్రతిభను అందరికీ వివరించేందుకు ఏకంగా ఓ వీడియోనే రూపొందించాడు సచిన్.

         సిరాజ్ బంతిని పట్టుకునే తీరు, అవుట్ స్వింగర్ వేసేటప్పుడు సీమ్ ను రిలీజ్ చేసే తీరు, ఇన్ స్వింగర్ వేసేటప్పుడు బంతిని ఎలా గింగిరాలు తిప్పుతాడో తన వీడియోలో వివరంగా తెలిపాడు మాస్టర్ బ్లాస్టర్. బ్రిస్బేన్ టెస్టు తొలిరోజున ఆసీస్ బ్యాట్స్ మెన్ సిరాజ్ స్వింగ్ కు ఎలా ఇబ్బంది పడ్డారో సచిన్ వివరించాడు. బ్రిస్బేన్ లో నిన్న  సిరాజ్ విసిరిన బంతులు అవుట్ స్వింగర్లు, ఇన్ కట్టర్లుగా దూసుకెళ్లాయంటే అది పిచ్ పై ఉన్న పగుళ్ల వల్ల కానేకాదని తేల్చి చెప్పాడు. అది సిరాజ్ ప్రతిభ వల్లేనని స్పష్టం చేశాడు సచిన్.

        ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఔటైన తీరును క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. 44 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న సమయంలో సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంపై సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా వంటి విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. అయితే తనపై వస్తున్న విమర్శలపై రోహిత్ శర్మ స్పందించాడు. ఆ షాట్ ఆడినందుకు తాను బాధ పడటం లేదని అన్నాడు. ఇదే టెక్నిక్ తో గతంలో తాను ఎన్నో బౌండరీలను సాధించానని చెప్పాడు. బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలాంటి షాట్లను ఆడుతుంటానని... ఇకపై కూడా తాను ఇలానే ఆడుతుంటానని తెలిపాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: