ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొన్ని కొన్ని అంశాల్లో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన ఉంది. అయితే పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలకు ఆయన ప్రోత్సాహం అందించడం లేదని అంటున్నారు. కొంతమంది నేతలు మీడియా ముందుకు కూడా రావట్లేదు. బీజేపీ నుంచి మీడియాతో మాట్లాడే నేతలు మొత్తం కలిపి నలుగురైదుగురు మినహా పెద్దగా ఎవరూ లేరు అని చెప్పాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి లేకపోతే భాను ప్రకాష్ రెడ్డి వీళ్ళిద్దరూ కాకపోతే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మినహా ఎవరు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటంలేదు.

రాష్ట్రంలో బలపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఇప్పుడు ప్రతి అంశంలో కూడా ఇలాగే వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్ళే విషయంలో సోము వీర్రాజు కొంతమందిని మాత్రమే పైకి తీసుకు వస్తున్నారు. ఇక ఎవరైనా నేతలు మీడియాతో మాట్లాడిన సరే టీవీ సమావేశంలో పాల్గొన్న సరే వారిని ఇబ్బందులు పెడుతున్నారు అనే భావన ఉంది. టీవీ డిబేట్ లో పాల్గొన్నారు అనే కారణంతో లంకా దినకర్ అనే ఒక నాయకుడుని సస్పెండ్ చేశారు.

దీని కారణంగా భారతీయ జనతా పార్టీలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పటికైనా సరే మీడియా సమావేశాల విషయంలో వైఖరి మార్చుకోకపోతే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆగ్రహంగా చూస్తున్నారు. రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న దాడుల విషయంలో కూడా బిజెపి హస్తం కూడా ఉండి ఉండవచ్చు అనే భావనలు కూడా ఉన్నాయి. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలు అందరూ కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రజల్లోకి వెళ్లడం వంటి కార్యక్రమాలు చేయకపోతే అనవసరంగా ఇబ్బంది పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: