జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్ర పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఆయన రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ చేసిన అతి పెద్ద తప్పు గా చెబుతున్నారు. అయితే జనసేన పార్టీ బలపడాలంటే భారతీయ జనతా పార్టీని వదిలి బయటకు వచ్చే కార్యక్రమాలు చేపట్టాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

రాజకీయంగా పవన్ కళ్యాణ్ నిలదొక్కుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీతో ప్రయాణం ఎంత మాత్రం మంచిది కాదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్ని విధాలుగా విమర్శలు చేసిన ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేకపోవడంతో ఇప్పుడు చాలా ఆగ్రహం ప్రజల్లో ఉంది. అంతే కాకుండా ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు అని ఆగ్రహం ఉంది.

అంతేకాకుండా అధికార పార్టీని అలాగే విపక్షాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నారని ఇక్కడి ప్రజలలో అభిప్రాయం ఎక్కువగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ముందుకు నడిపించాలంటే బీజేపీతో స్నేహం చేయకుండా ఉండడమే మంచిది అని అంటున్నారు. ఇప్పటివరకు బీజేపీతో కలిసి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ సొంతగా కార్యక్రమాలు చేపట్టడానికి రెడీ అవుతున్నారని త్వరలోనే ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన పర్యటనకు సంబంధించి జనసేన పార్టీలో ఒక కమిటీని ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా విధివిధానాలను రూపొందించాలి అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: