ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖ ఇప్పుడు విపక్షాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా పోలీసులు కొన్ని కొన్ని విషయాల్లో అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగం జాగ్రత్తగా లేకపోతే మాత్రం అనేక ఇబ్బందులు రాష్ట్ర డిజిపి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు పదేపదే అధికార పార్టీకి సహకరించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు, ఇతర విపక్షాలు మీద ఎక్కువ కేసులు బనాయించడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 ఇక తాజాగా జరిగిన రామతీర్ధం సంఘటన విషయంలో తెలుగుదేశం పార్టీని అలాగే భారతీయ జనతా పార్టీని డిజిపి లాగడంపై తీవ్రస్థాయిలో విపక్షాలు మండిపడుతున్నాయి. రెండు రోజుల క్రితం మాట్లాడిన డిజిపి... రాజకీయ కోణం లేదని స్పష్టం గా చెప్పి మళ్ళీ వెంటనే దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అని ప్రకటన చేయడంతో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం చూస్తే డిజిపి మాట్లాడింది రాజకీయ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ లా ఉంది అంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

రాజకీయంగా ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఉన్న తరుణంలో డీజీపీ స్థాయి లో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బిజెపి కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు డీజీపీని సుప్రీంకోర్టుకి లాగే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందని అంటున్నారు. గత కొంతకాలంగా డీజీపీ వ్యవహారాలను... సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని రాష్ట్రంలో పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని... ఇప్పటికే కోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా సరే రాష్ట్ర డిజిపి తీరులో మార్పు రాలేదని కాబట్టి సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని ఆయన కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: