ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయనే వార్తలు రాజకీయవర్గాలలో ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బలంగా ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రానికి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే దీని కారణంగా అప్పులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

 రాష్ట్రంలో ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేకపోవడం... అలాగే రాష్ట్రానికి అప్పులు కూడా వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అనవసర పన్నులన్నీ కూడా ప్రజల మీద రుద్దుతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇటీవల కుక్కల మీద కూడా పన్ను వేసారు. విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉండగా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో జగన్ పరిపాలన పై అధికారులలో విస్మయం వ్యక్తమవుతోంది.

ఆర్థిక శాఖ అధికారులు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అనే భావన రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల కేటాయింపు విషయంలో అనేక ఇబ్బందులు పెడుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉన్నాసరే ఇప్పటి వరకు ముందుకు సాగడంలేదు. పోలవరం ప్రాజెక్టు తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. అయినా సరే రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పని తీరు ఘోరంగా ఉంది. ఈ అంశాలన్నీ కూడా జగన్ కేంద్ర ప్రభుత్వానికి వివరించి నిధులు పొందే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: