ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి. దానితో పాటు కరోనా వైరస్ కేసులు కూడా అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. . ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక   బులిటెన్‌ విడుదల చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా  గడిచిన 24 గంటల్లో 25 వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 114 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8 లక్షల 85 వేలకి చేరింది....

ఇక, చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య ఏడు వేలకు చేరింది.

అలాగే రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. కరోనా బారి నుంచి శనివారం మొత్తం 326 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల 76 వేల మంది  పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,987 కు చేరాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 25 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, జిల్లాల వారీగా కేసులు చూస్తే శనివారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 24 కరోనా కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు అత్యల్పంగా ఉండడం విశేషం. అయితే దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగింది.. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసి  వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది  . ఇందులో భాగంగా మొదటి దశలో వైద్య మరియు పారిశుద్ధ్య సిబ్బందికి టీకాలను వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: