ఏపీ సీఎం జగన్ మరోసారి రికార్డు సాధించారు. రెండేళ్ల క్రితమే మొట్టమొదటి సారి సీఎం అయిన సీఎం జగన్.. ఇప్పుడు దేశంలోనే సంచలనం సృష్టిస్తున్నారు. దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో ఒక టాప్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌ ఏబీపీ న్యూస్‌ చేసిన సర్వేలో బెస్ట్‌ సీఎంలలో జగన్ ధర్డ్ ప్లేస్ సాధించారు. మరి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఎవరికి అంటారా.. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు.

అసలు దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఈ ఘనత సాధించారు. హేమాహేమీల్లాంటి ముఖ్యమంత్రులు రేసులు ఉన్నా.. జగన్ మూడో స్థానంలో నిలవడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ ఏబీపీ న్యూస్‌ సర్వేలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ 9వ స్థానంలో, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10వ స్థానంలో నిలిచారు.

ఏబీపీ–సీఓటర్‌ సంస్థ దేశ్‌ కా మూడ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది. మొత్తం మీద సంక్షేమంలో నెంబర్ వన్‌ గా నిలుస్తూ.. జగన్ సంక్షేమంలో టాప్ గా నిలుస్తున్నాడు. జగన్ పరిపాలనలో అభివృద్ధి కంటే సంక్షేమం కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ గతంలో ఓ మాట చెప్పేవాడు.. ఒక్కసారి తనకు అధికారం ఇస్తే 30 ఏళ్లు పాలిస్తానని చెప్పేవాడు.. అంతేకాదు.. ప్రతి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉండాలని.. అంతగా ప్రజలు మరిచిపోలేని సేవలు అందిస్తానని అనేవాడు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే సంక్షేమం ఒక్కటే 30 ఏళ్ల పాలనకు పునాదులు వేయలేదు. సంక్షేమం,  ప్రగతి రెండు రెండు కళ్లుగా పాలన సాగితేనే.. సుదీర్ఘ కాలం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: