గత కొంతకాలంగా ఏపీలో పలు హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అవుతున్న ఘటనలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసింది. దీనిపై గత కొద్ది రోజులుగా రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు అధికార పార్టీ వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నాయి. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఏపీ లో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఈ దాడుల వెనుక జగన్ ప్రమేయం ఉందని ఎన్నో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.







ఏపీలో అనేక ఆలయాలపై దాడులు వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని  ప్రకటించారు. ముఖ్యంగా టిడిపి, బిజెపి నేతల హస్తం ఉందంటూ ఆయన వెల్లడించారు. 17 మంది టిడిపి నాయకులు, నలుగురు బిజెపి నాయకుల హస్తం ఉందంటూ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇప్పటికే పదమూడు మంది టిడిపి నాయకులు, బీజేపీ నేతలను అరెస్టు చేసినట్లు ఆయన ప్రకటించారు. బిజెపి వివరణ తో ఏపీ  బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వీర్రాజు ఘాటు హెచ్చరికతో కూడిన లేఖ రాశారు. ఆలయాలపై దాడులు వ్యవహారం వెనుక బీజేపీ వారు ఉన్నారని మాట్లాడడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు.




 ఈ మేరకు డీజీపీ వ్యాఖ్యలను తప్పు పడుతూ  లేఖ విడుదల చేశారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారు అని, ఆలయాలపై దాడులకు బిజెపి కి ఎటువంటి సంబంధం లేదని, దీనిపై మరోసారి క్లారిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.అలాగే ఈ వ్యవహారంపై డిజిపి వివరణ ఇవ్వకపోతే క్రిమినల్ లా కింద విచారణ చేసి పరువు నష్టం దావా వేస్తా అమౌంటు వీర్రాజు హెచ్చరించారు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, హెచ్చరించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: