కేసిఆర్ రాజకీయ వారసుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు , మరెన్నో టెన్షన్ లకు గురవుతున్నారు. తెలంగాణ సీఎం పీఠంపై కూర్చునేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో, పార్టీలో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వాటిని అధిగమించేందుకు మరెన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా టిఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించే పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రధాన రాజకీయ శత్రువుగా బిజెపి ఉండడం,  ఆ పార్టీ ఈ మధ్యకాలంలో బాగా బలం పెంచుకోవడం టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం,  ఇవన్నీ టిఆర్ఎస్ తో పాటు కేటీఆర్ కు పెద్ద ఇబ్బందికరంగా మారింది. 





ఆ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా, అవి సాధ్యపడడం లేదు. ఇప్పటికే గ్రేటర్, దుబ్బాక ఎన్నికలలో టిఆర్ఎ స్ కు ఎదురు గాలి బాగా వీచింది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు,  అలాగే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇలా ఎన్నో ఉండడంతో,  కేటీఆర్ మరింత టెన్షన్ పడుతున్నారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉండాలని కేటీఆర్ భావిస్తున్నారు. అప్పుడే సీఎం పీఠంపై ప్రశాంతంగా కూర్చోగలను అని అభిప్రాయపడుతున్నారు. కానీ దానికి తగ్గ పరిస్థితులు ఏర్పడడం లేదు. 





ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అసంతృప్తులను గుర్తించి వారిని బుజ్జగించడం, నియోజకవర్గాల వారీగా గ్రూపు రాజకీయాలు పెరిగిన నేపథ్యంలో వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించి,  పార్టీలోని నాయకులకు బాధ్యతలు అప్పగించి పరిస్థితులను చక్క దిద్దుతూ, కేటీఆర్ గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో గెలిచి ఆ ఉత్సాహంతో సీఎం పీఠంపై కూర్చోవాలని చూస్తున్నారు. అందుకే గత కొద్ది రోజులుగా ఇంతగా కేటీఆర్ టెన్షన్ పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: