బీజేపీకి మంచి వ్యూహకర్తలు ఉన్నారు. తలచుకోవాలే కానీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. ఈశాన్య రాష్ట్రాలో బీజేపీ ఏ విధంగా కమల వికాసం జరిపిందో అందరికీ తెలిసిందే. ఇక బీజేపీకి ఎన్నడూ కొరుకుడు పడని రెండు తెలుగు రాష్ట్రాలు ఇపుడిపుడే గాడిన పడుతున్నాయి.

ఇక్కడ కాషాయ పార్టీకి కొంత అనుకూల వాతావరణం కూడా కనిపిస్తోంది. తెలంగాణాలో కాషాయ అజెండా పూర్తిగా అమలు అవుతోంది. అక్కడ ఎపుడు సార్వత్రిక  ఎన్నికలు పెట్టినా తమదే విజయం అని బీజేపీ గట్టిగా డిసైడ్ అయిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికతో ఉరకలెత్తిన ఉత్సాహం  కాస్తా గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికల నాటికి రెట్టింపు అయింది. ఇపుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసం బీజేపీ రెడీ అవుతోంది.

ఇక అదే సమయంలో ఏపీలో కూడా బలమైన హిందూత్వ అజెండాను అమలు చేయడానికి బీజేపీ సిధ్ధపడుతోంది. దానికి హిందూ దేవతల విగ్రహాల విద్వంశం ఘటనలు కూడా కలసి రావడంతో బీజేపీ ఒక్కసారిగా జోరు పెంచేసింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఏపీలో అధికార వైసీపీ కూడా హిందూత్వ వైపుగా మళ్లాల్సివస్తోంది. ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం కూడా ఇపుడు మతం గురించి ఎక్కువగా మాట్లాడుతోంది.

మరో వైపు బీజీపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా హిందువులు దేవాలయాలు అంటున్నారు. ఇలా ఏ ఒక్క ప్రజా సమస్య ఇపుడు చర్చకు రావడం లేదు. ప్రత్యేక హోదాలు ఊసు లేదు, విభజన హమీల గోల అంత కంటేలేదు. ఏపీకి రావాల్సిన నిధుల గురించిన చర్చ కూడా లేదు. అన్నీ పక్కకు పోయి గుడులూ గోపురాలు అంటూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. బీజేపీ ట్రాప్ లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పడిపోయాయని అంటున్నారు. ఇది అటు ఇటూ తిరిగి చివరకి ఏపీలో బీజేపీ ఎదుగుదలకు మేలు చేస్తుందని అంటున్నారు.  చూడాలి మరి ఇక మీదట ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: