ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతకుమునుపు ఉన్న అధ్యక్షుడే  మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉంటారు. ఎవరైనా సరే రెండుసార్లు విజయం సాధించి ఆ తర్వాత ఓటమిపాలు అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  ఇదే ఫలితం వెలువడుతుందని ట్రంప్  మరోసారి విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ  అనూహ్యంగా జో బైడెన్  భారీ మెజారిటీ సాధించి విజయం సాధించడంతో ట్రంప్ కి భారీ షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే.


 అయితే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము  అనే దానిపై జో బైడెన్ ఎన్నో రకాల హామీలను అమెరికా ప్రజలకు ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో జో బైడెన్ అధికారికంగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు  అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు భారీగా నిధులు విడుదల చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం ఏకంగా 138 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు జో బైడెన్ సిద్ధమయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన నిధులు విడుదల పై సంతకం పెట్టేందుకు సిద్ధమయ్యారు జో బైడెన్.



 అయితే ప్రస్తుతం జో బైడెన్ మోడీ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కరోనా  సంక్షోభం సమయంలో 20 లక్షల కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్బర్ భారత్లో భాగంగా ఎంతో మందికి చేయూతనందించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు ఇలాగే అమెరికాలో  138 లక్షల కోట్లు విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు, అప్పులు కట్టలేని వారికి లేదా నష్టాల్లో కూరుకుపోయిన వారిని ఆదుకునేందుకు నిధులు ఉపయోగించనున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: