ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వింతపోకడ పోతుంది.  అధికార ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిమ్మడమే లక్ష్యంగా గతంలో ఎప్పుడు లేని నీచమైన రాజకీయాలు చేయడానికి పూనుకుంటుంది.. మొన్నటిదాకా కుల రాజకీయాలు చేసి లాభపడిన టీడీపీ ఇప్పుడు మత రాజకీయాలు చేసి పోయిన బలాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తుంది. సీఎం జగన్ క్రిస్టియన్ అవడంతో దాన్ని ఉపయోగించుకుని, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుంది.

ఇంత నీచమైన రాజకీయాన్ని చేస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తుందో కానీ తామే నేరానికి పాల్పడి ఆ నేరాన్ని ప్రభుత్వంపై తోసి తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది.  దీనికి తోడు కొన్ని పచ్చమీడియా లు కూడా వీటికి వంత పడుతూ మీడియా విలువల్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాయి. అయితే రాష్ట్రములో పొలిసు వ్యవస్థ ఇంకా బ్రతికే ఉన్నవేళ, ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మని వేళా పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టిన రిపోర్టులో టీడీపీ, బీజేపీ నేతల బండారం బయటపడింది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన ఘటనల్లో 17 మంది టీడీపీ కార్యకర్తల పాత్రను ఆధారాలతో సహా గుర్తించారు. వారితో పాటుగా మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు కూడా మత విద్వేషాలు రాజేసే యత్నం సాగించారు. ఇద్దరు టీవీ చానెళ్ల విలేకర్లతో పాటుగా 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. దాంతో తామే వివాదం సృష్టించి, దానికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా నిందించి, గుడ్డ కాల్చి మొఖం మీద రాజకీయాలకు బాబు అండ్ కో తెరలేపినట్టు స్పష్టమవుతోంది. రాజకీయ కుట్రలతో జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం వెనుక అసలు కారకులు వెలుగులోకి రావడంతో ఇప్పుడు మళ్లీ రంకెలేస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: