మన ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది.. ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలియజెప్పింది. ఏ విషయంలో అంటారా.. కరోనా టీకాల విషయంలో.. అవును.. మొన్న ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ ఇండియాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇండియా ఒక్క రోజులోనే అత్యధిక టీకాలు వేసిన రికార్డును సొంతం చేసుకుంది. కొవిడ్‌ టీకాల విషయంలో భారత్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది.

భారత్‌లో తొలి రోజు 2,07,229 మందికి కరోనా టీకాలు ఇచ్చామని కేంద్రం ప్రకటించింది. ఒక రోజు వ్యాక్సినేషన్‌లో భారత్‌దే మొదటి స్థానం. ఇప్పటికే వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టిన యూకే, ఫ్రాన్స్‌, అమెరికాను భారత్‌ తొలిరోజే అధిగమించింది. మొదటి రోజు 2,07,229 మందికి కరోనా టీకాలు ఇచ్చింది ఇండియా. రెండోరోజు ఆరు రాష్ట్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగింది. రెండో రోజు  17,072 మందికి కొవిడ్‌ టీకాలు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంటే.. మొత్తం రెండ్రోజుల్లో 2,24,301 మందికి కొవిడ్‌ టీకాలు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక తెలంగాణలో ఇవాళ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది. ఇవాళ 324 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. తొలిరోజు తెలంగాణలో 140 కేంద్రాల్లో మాత్రమే కొవిడ్‌ వాక్సినేషన్ జరిగింది. ఇవాళ వీటికి అదనంగా 184 కేంద్రాల్లో టీకాలు వేసేందుకు  అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ ఒక్క  హైదరాబాద్‌లోనే 42 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో జిల్లాలవారీగా టీకాలు వేయించుకుకునే వారి జాబితా సిద్ధం చేశారు. ఇవాళ  ప్రతి కేంద్రంలో 50 మందికి సిబ్బంది టీకాలు వేయాలని డిసైడ్ అయ్యారు. తొలి రోజు ప్రతి కేంద్రంలో 30 మందికే టీకా వేసిన అధికారులు.. ఇప్పుడు క్రమంగా ఆ సంఖ్యను 50 కి పెంచారు. ఇలా మొత్తం మీద ఇండియా తన కరోనా టీకాల వ్యాక్సినేషన్‌ను  దశల వారీగా అమలు చేస్తోంది. ప్రపంచానికి తన సత్తా చాటుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: