ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు బలం తక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కొన్ని కొన్ని అంశాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటాయి. వాస్తవానికి ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా బలహీనంగానే ఉంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద ఎక్కువగా దృష్టి పెట్టారని రాజకీయవర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పార్టీకి మినహా మరో పార్టీకి ఇప్పటివరకు అవకాశం రాలేదు.

గతంలో వామపక్షాలు కూడా గట్టిగానే ప్రభావం చూపించాయి. టిఆర్ఎస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో ఎంత బలంగా ఉన్నా సరే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ప్రభావం చూపించలేదని చెప్పాలి. వేరే పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలను పార్టీలోకి తీసుకునే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేశారు. అయినా సరే పెద్దగా ఫలితం లేదు అనే భావన టిఆర్ఎస్ పార్టీ నేతలే స్వయంగా వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూశాం. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా మీద బిజెపి ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెరాస పార్టీలోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీద ఎక్కువగా దృష్టి సారించిందని టాక్.

అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల మీద కూడా దృష్టి పెట్టిందని అంటున్నారు. వాస్తవానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే టిఆర్ఎస్ పార్టీలో ఆయన విషయంలో జాగ్రత్తగా ఉన్నారని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ వద్ద నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు విషయంలో కూడా సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఆయన భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అలాగే మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు బిజెపి వైపు చూడటం తో సీఎం కేసీఆర్ కాస్త వాళ్ళతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: