తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆరేళ్ల నుంచి చాలా కష్ట కాలంలో నడుస్తుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయినా సరే మనం మాత్రం పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆయన కొన్ని కొన్ని విషయాల్లో టీఆర్ఎస్ పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వచ్చిన ప్రజలలో ఎంతో కొంత మద్దతు ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ఓటు బ్యాంక్ ఎక్కువ కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాత్రం అసలు పట్టించుకునే పరిస్థితి లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో కూడా ఆయన ఒక స్పష్టత రాలేదని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తున్నాయి. అయినా సరే ఈ విషయంలో మాత్రం ఆయన ముందుకు రాలేకపోతున్నారు. కనీసం కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా ఆయన తెలుసుకుని ముందుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అవసరమైతే రాజీనామా చేస్తే మరొకరికి ఆ పదవి ఇస్తామని కాబట్టి ఇలాంటి వైఖరితో ముందుకు వెళ్లకుండా ఉండటమే మంచిది అని అసలు ఇప్పటివరకు మీ పనితీరు విషయంలో సానుకూల నివేదికలు ఒక్కటి కూడా రాలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: