దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి పుట్టిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర వెలుపలకు క్రమంగా పార్టీని విస్తరిస్తున్న శివసేన తాజాగా బెంగాల్ బరిలోనూ దిగాలని నిర్ణయించింది. పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగాల్ ఎన్నికల్లో తాము పోటీ చేయబోతున్నామని ఆయన చెప్పారు.

     గతేడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేన పోటీ చేసింది. అయితే, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 22 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ఓట్లను రాబట్టుకోవడంలో పార్టీ ఘోరంగా విఫలమైంది. శివసేనకు 0.05 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇవి ‘నోటా’కు వచ్చిన ఓట్ల కంటే తక్కువ. బీహార్ లో నోటాకు 1.68 శాతం ఓట్లు పోలయ్యాయి. 2016లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేన పోటీ చేసింది. అయితే అప్పుడు తనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో కలిసి శివసేన బరిలో నిలిచింది. ఈసారి మాత్రం సొంతంగానే 90 సీట్ల వరకు పోటీ చేయాలని శివసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

             మహారాష్ట్రలో బీజేపీతో పోరాటం చేస్తున్న శివసేన.. బెంగాల్ లో అధికారం కోసం పావులు కదుపుతున్న ఆ పార్టీని దెబ్బ కొట్టడానికే ఎన్నికల్లో పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. బెంగాల్ లో హిందుత్వ నినాదంతోనే ఎన్నికలను ఎదుర్కొంటోంది బీజేపీ. శివసేన కూడా హిందుత్వ కార్డుతోనే పని చేస్తోంది.దీంతో శివసేన పోటీ వల్ల బీజేపీ ఓట్లకు గండి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ముస్లిం ఓట్ల టీఎంసీకి గంపగుత్తగా పడకుండా చూసేందుకు బెంగాల్ లో ఎంఐఎం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంకు కౌంటర్ గా హిందూ ఓట్లు చీలేలా బెంగాల్ లో శివసేన పోటీ చేసేలా ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఎత్తులు వేస్తున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: