ఎమ్మెల్యే అంటే.. నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాడ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఇప్పుడు చిత్ర‌మైన రాజ‌కీయం వెలుగు చూసింది. క‌ర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఆర్థ‌ర్ వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఆధిప‌త్య రాజ‌కీ యాలు ఇక్క‌డ నిత్యం ర‌గులుతూనే ఉన్నాయి. త‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన‌..  బైరెడ్డి ఫ్యామిలీకి  పెట్టేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. గ‌ట్టి వాయిస్ వినిపించే నాయ‌కుడిగా సిద్ధార్థ రెడ్డి గుర్తింపు పొందారు.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ సిద్ధార్థ‌రెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇక్క‌డ ఎమ్మెల్యేక‌న్నా దూకుడుగా సిద్ధార్థ రెడ్డి దూసుకుపోతున్నారు. అయితే.. ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా ఆర్థ‌ర్‌కు సిద్ధార్థ‌రెడ్డికి మ‌ధ్య వివాదంగా మారింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు పంచాయి‌తీలు కూడా జ‌రిగాయి. అయిన్ప‌టికీ.. ఇద్ద‌రిలోనూ మార్పు రాలేదు. చివ‌ర‌కు ఎమ్మెల్యే ఆర్ధ‌ర్‌ను మండ‌లాల‌కు ప‌రిమితం చేస్తున్నారు. ఇక‌, తాజాగా.. రేష‌న్ ను ఇంటింటికీ పంపించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు పంపిణీ వాహ‌నాల‌ను సిద్ధం చేసింది. వీటిని ల‌బ్ధిదారుల ఇంటి ముందుకే తీసుకువెళ్లి రేష‌న్‌ను ఇవ్వ‌నున్నారు.

అయితే.. ఈ వాహ‌నాల కేటాయింపు విష‌యంలోనూ ఆర్థ‌ర్‌కు, సిద్ధార్థ‌రెడ్డికి మ‌ద్య వివాదం చోటు చేసుకుం ది. నందికొట్కూరు నియోజకవర్గానికి 61 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిం ది. ఇక‌, తుది నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ విష‌యం ఎమ్మెల్యేకు కూడా తెలియ‌కుండానే సిద్ధార్థ రెడ్డి క‌నుస‌న్న‌ల్లో.. అధికారులు చ‌క్రం తిప్పారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆర్థ‌ర్‌.. త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని పేర్కొంటూ..పార్టీ జిల్లా ఇంచార్జ్ కి ఫిర్యాదు చేశారు. త‌న‌కు కేవ‌లం పాములపాడు మండ‌లం త‌ప్ప  మిగిలిన మండలాల్లో సిద్ధార్థరెడ్డి సూచించిన జాబితాను ఫైనల్ చేస్తున్నార‌ని.. ఆయ‌న ఫిర్యాదు చేశారు.

ల‌బ్ధిదారుల విష‌యంలో ఇష్టానుసారం వ్య‌వ‌హరిస్తే.. తాను  ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని అధికారుల ను సైతం హెచ్చరించారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ఈ నేప‌థ్యంలో ఎంపీడీవోలు.. జోక్యం చేసుకుని.. ప్ర‌క్రియ నిలిచిపోయింద‌ని.. సో.. ఇప్ప‌టికైనా మీరు స్పందించాల‌ని.. క‌లెక్ట‌ర్‌కు విన్నవించారు. ఈ క్ర‌మంలోనే అటు ఆర్థ‌ర్‌కు, ఇటు సిద్ధార్థ‌రెడ్డికి స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.   ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ చొప్పున మండ‌లాల‌ను ఇచ్చేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేశారు. అంటే సగం మంది లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే.. మిగిలిన సగం మందిని సిద్ధార్థరెడ్డి ఫైనల్‌ చేసేలా ఢీల్‌ కుదిర్చా రట. మొత్తానికి ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తే.. సిద్ధార్థ‌రెడ్డి దూకుడు.. ఆర్థ‌ర్ ప‌రిస్థితి ఎలా ఉన్నాయో.. అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: