ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే పార్టీలో ఉన్న అగ్ర నేతలు అందరూ కూడా సమర్థవంతంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా అచ్చెన్నాయుడు బలంగా ఉన్న నేత కావడంతో చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు కీలక పదవిని అప్పగించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించిన తర్వాత అచ్చెన్నాయుడు ప్రజల్లోకి రావడంలో విఫలం అయ్యారు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రజా సమస్యల విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారు అనే భావన ఉంది. అంతే కాకుండా పార్టీ నేతలతో కూడా పెద్దగా సమావేశాలు నిర్వహించ లేకపోతున్నారు తిరుపతి ఉప ఎన్నికలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీరియస్గా తీసుకున్నా సరే ఆయన మాత్రం సీరియస్గా తీసుకోలేదని కనీసం తిరుపతి ఉప ఎన్నికల కోసం ఆయన అక్కడ పర్యటన చేసి పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించలేక పోయారు అని తెలుగుదేశం పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశం ఈ సమావేశంలో ఆయన కొన్ని సూచనలు చేయడం మినహా తిరుపతి వెళ్లే ఆలోచన చేయలేదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద ఆయన ఇప్పటివరకు ఒక నివేదిక కూడా తీసుకుని చంద్రబాబు నాయుడుకు... ఆ నివేదిక ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి అనే మాట వాస్తవం. ఇదే కొనసాగితే మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఈ విషయంలో ఆలోచిస్తే మంచిది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆయన మీద చాలా మంది సీరియస్గా ఉన్నా సరే వారితో కూడా ఆయన చర్చలు జరపలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: