ఈ మధ్య కాలంలో ఏదో ఒక ఇల్లీగల్ దందా చేయడం భారీగా డబ్బులు సంపాదించడం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఇల్లీగల్ దందాలు చేయడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. చివరికి ఇల్లీగల్ దండాలు బయటపడడంతో కటకటాల పాలవుతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ఇక్కడ ఒక యువకుడు ఎంబీఏ వరకు చదువు పూర్తి చేశాడు. ఇక మంచి ఉద్యోగం కోసం వెతకడం మానేసి ఏదో ఒక ఇల్లీగల్ దందా చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడికి ఒక ఆలోచన తట్టింది.



 ప్రజల అవసరాలను ఆసరాగా మార్చుకొని ఇల్లీగల్ దందా చేయాలి అనుకున్నాడు.  తద్వారా భారీగా డబ్బులు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు అని పక్క ప్లాన్ వేసాడు. ఇక కొన్ని రోజుల వరకు అతని దందా  సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం చివరికి కటకటాల పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. బీహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది అన్న విషయం తెలిసిందే.  ప్రజలకు మద్యం తాగాలని అనిపించినప్పటికీ మందు దొరకని పరిస్థితి.


 ఈ క్రమంలోనే ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఇక్కడ ఒక యువకుడు. ఇక ఇల్లీగల్ దందా మొదలు పెట్టాడు.  ఎవరికీ తెలియకుండా రహస్యంగా లిక్కర్ అమ్మకాలు జరపడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని రోజుల వరకు అక్రమ వ్యాపారం తో రోజుకు తొమ్మిది లక్షల రూపాయల వరకు సంపాదించేవాడు సదరు యువకుడు. ఇక ఇలా సంపాదించిన మొత్తం తో మంచి ఇల్లు, కార్లు, బైక్ ఇలాంటివి కొని  విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు నిరుద్యోగులుగా ఉన్న మరో 40 మంది ని అతని ఇల్లీగల్ దందా లో చేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నిఘా పెట్టిన పోలీసులు అసలు విషయం బయట పడడంతో  21 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు కార్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: