ప్రస్తుతం మాస్క్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి మాస్క్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అంతేకాకుండా అటు ప్రభుత్వాలు మాస్కు తప్పనిసరిగా ధరించాలి అనే నిబంధన పెట్టిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరూ ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరిగా మాస్క్  ధరించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మాస్క్ వాడకం భారీగా పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు చెప్పక పోయినప్పటికీ సొంతంగా మాస్కులు వాడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



 ఈ క్రమంలోనే కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కోట్ల సంఖ్యలో మాస్క్  వాడకం జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.  ఎంతో మంది వివిధ రకాల మాస్క్ లను  వాడారు. అయితే ప్రస్తుతం మాస్క్ వల్ల కూడా మరో ముప్పు పొంచి ఉంది అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే..  ఇక కోట్ల సంఖ్యలో మాస్కుల వాడకం జరిగిన నేపథ్యంలో మాస్క్ వ్యర్థాలు పేరుకుపోవడం పై ప్రస్తుతం పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికే ఎన్నో రకాల వ్యర్థాలతో తీవ్ర స్థాయిలో పర్యావరణ కాలుష్యం జరుగి  మానవాళికి ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇక ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతం మాస్కు తప్పనిసరిగా మారిపోయిన నేపథ్యంలో రోజురోజుకు మాస్క్ వాడకం పెరిగిపోతున్నది  తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దీంతో మాస్కు వ్యర్థాలు పేరుకుపోతున్నాయి..  దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన లో మునిగిపోతున్నారు. మాస్కు మట్టిలో కలవడానికి 50 ఏళ్లు పడుతుందని.. ఇక మాస్కు పై ఉండే పొర పాలీ ప్రొఫైలిన్ మట్టిలో కలవడానికి 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఎంతగానో పర్యావరణ కాలుష్యం జరుగుతుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: