ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో అవినీతి చేస్తున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతల అవినీతి ముఖ్యమంత్రి జగన్ ని ఖచ్చితంగా ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా రాష్ట్రంలో బలపడడానికి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద ప్రత్యేకంగా బీజేపీ దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా  దృష్టి పెట్టారని అంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరుగుతున్న భూకబ్జాలు విషయంలో ఆయన కొంతమంది పాత్రకు సంబంధించి నివేదికను కూడా తెప్పించుకున్నారని వారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలో కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు కొన్ని అంశాలలో వైసీపీ నేతలు వెనకబడి ఉన్నారు.

ప్రజల్లోకి వెళ్లకుండా కొన్ని వ్యవహారాలను ఎక్కువగా చక్కబెడుతున్నారనే సమాచారం కూడా ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది. తాను ప్రాధాన్యత ఇస్తున్న నేతలు కూడా అవినీతి వ్యవహారాలలో ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి  సీరియస్ గా ఉన్నారు అని త్వరలోనే మరికొంతమంది మీద విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎంపీలు విషయంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఎక్కువగా అవినీతి చేస్తున్నారని భూకబ్జాలు ఎక్కువగా చేస్తున్నారని పలువురు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మరి జగన్ ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. బిజెపి ఫోకస్ చేస్తే మాత్రం జగన్ ఇబ్బంది పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: