ఇంటర్నెట్ డెస్క్: దేశ పౌరులకు ఓటు హక్కు ఎంతో విలువైనది. అయితే ఓటు కార్డు పొందే సమయంలో కొన్ని సార్లు తప్పులు దొర్లుంతుంటాయి. పేరులో అక్షరాలు తప్పుగా రావడం, పుట్టిన తేదీ తప్పుగా రావడం, తండ్రి పేరు తప్పుగా రావడం, అడ్రస్ మార్పుగా ఉండడం.. ఇలా అనేక తప్పులు జరుగుతుంటాయి. అయితే ఈ తప్పులను సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సమస్యలుంటే ఈ కింది సూత్రాలను ఫాలో అవండి.. కచ్చితంగా మా సమస్య తీరిపోతుంది. అంతేకాదు ఎవరి సహాయమూ లేకుండా మీ అంతట మీరే మీ ఓటరు కార్డులో సవరణలు చేసుకోగలుగుతారు.

మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు. మీ ఓటర్ ఐడీ కార్డులో తప్పుల్ని మీరే సరిచేసుకోవచ్చు. అది కూడా కేవలం 5 నిమిషాల్లో. అందుకోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేదు. దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది, మరి మీ ఓటర్ ఐడీ కార్డులో పేరు, పుట్టిన తేదీ, వయస్సు, అడ్రస్ లాంటి వివరాలను ఎలా సరిచేయాలో తెలుసుకోండి.

ఓటర్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
మీ బ్రౌజర్‌లో https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ఎడమవైపు ‘Login/Register’ అని ఓ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
కొత్త వినియోగదారులైతే ‘Register as New user’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
Send OTP పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ చేయండి.
లాగిన్ చేసిన తర్వాత ‘Click on Correction in Personal Details’ పై క్లిక్ చేయండి.
మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేయండి.
మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, ఫోటో లాంటి వివరాలు అప్‌డేట్ చేయొచ్చు.
మీ వివరాలు అప్‌డేట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
చివరగా సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది.
రిఫరెన్స్ ఐడీ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఇక అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే..
ఒకవేళ మీరు ఇప్పటికే ఓటరు కార్డులో ఏదైనా మార్పు కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే..ఆ అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేసేందుకు కూడా https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. హోమ్ పేజీలో కుడివైపు ‘Track application Status’ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘Enter reference id’ దగ్గర మీ రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయండి.
దాని కింద ఉన్న ‘Track Status’ బటన్‌పై క్లిక్ చేయండి. వెంటనే మీ దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: