ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. చాలా మంది యువ నేతలు పార్టీకి దూరంగా ఉన్నారనే ప్రచారం ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు అని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం అనేక ఇబ్బందులు ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు రెడీ అయినట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది.

అలాగే వరంగల్ జిల్లాలో కూడా ఆయన పర్యటించడానికి రెడీ అయ్యారని అంటున్నారు. నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి బిజెపి ఇప్పటికే అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అనేది ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో త్వరలోనే ప్రచారం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కొంతమంది అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో సీఎం కేసీఆర్ త్వరలో భేటీ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడానికి ఆయన ద్వారా కొన్ని ప్రయత్నాలను సీఎం కేసీఆర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఎంత వరకు టిఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు సిఎం గాలం వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: