తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడాలి అంటే  కొన్ని కొన్ని అంశాలలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న నారా లోకేష్ మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో కొంత మంది నేతలను కలుపుకుని వెళ్లాల్సి ఉన్నా సరే ఆయన మాత్రం ప్రజల్లోకి వెళ్ళే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో అదే విధంగా గుంటూరు జిల్లాలో కొంత మంది నేతలను ఆయన పక్కన పెట్టారని ప్రచారం ఉంది.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విషయంలో నారా లోకేష్ వివాదాస్పదంగా చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినపడుతున్నా ఆయన నుంచి మంచి స్పందన రావడం లేదు. పార్టీలో విభేదాలను పరిష్కరించుకునే విషయంలో గానీ మీడియాకు క్లారిటీ ఇచ్చే విషయంలో గానీ లోకేష్ ముందుకు రాలేకపోతున్నారు. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా చాలామంది నేతలు పార్టీలో అసహనంగా ఉన్నా సరే లోకేష్ మాత్రం వారితో చర్చలు జరిపే  ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదు. అగ్రనేతలు గా ఉన్న కొంతమంది విషయంలో కూడా ఆయన ఇలాగే వ్యవహరించడంతో పార్టీ నేతలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి. 

జెసి దివాకర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు నరకం చూస్తుంది. అయినా సరే వారికి మాత్రం నైతిక మద్దతు కూడా ఇవ్వలేక పోతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పరిటాల కుటుంబం కూడా ఇప్పుడు పార్టీలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని కొంతమంది నేతలు కారణంగా పరిటాల శ్రీరామ్ ఇబ్బందులు పడుతున్నారని ప్రచారం ఉన్నా సరే నారా లోకేష్ మాత్రం ఆయనతో చర్చలు జరపడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. ఇలాంటి వైఖరి కారణంగా పార్టీ ప్రజల్లో చులకన అవుతుందని కూడా కొంతమంది అంటున్నారు. ఎంతసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తిట్టడం వల్ల ఉపయోగం లేదని కొంతమంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: