ఏపీలో రాజకీయం అంతా దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో దీనికి సంబంధించి యాత్ర కూడా చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ సంధర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి కోర్ కమిటీ భేటీలో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చిస్తారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారని కాని దానికి విరుద్ధంగా మతతత్వం పై చర్చించారని ఆయన అన్నారు. రథ యాత్ర ఎందుకు చేస్తున్నారు..రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా ? అని ఆయన ప్రశ్నించారు. అంతర్వేది ఘటన పై సిబిఐ ఎంక్వయిరీ వేసాము ఇప్పటి వరకు ఎందుకు స్టార్ట్ చేయించలేకపోయారని అన్నారు. బిజెపిలో ఉన్న వాళ్ళే హిందువుల్లా మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు హిందువులు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. 

అయోధ్య సమస్య ఎవ్వరు తీర్చలేకపోయినా మోడి హయాంలో సమస్య తీరిందని అన్నారు. అది నాయకత్వం అంటే అని పేర్కొన్న ఆయన అలాంటి నాయకత్వం జగన్ లో ఉందని అన్నారు. హంగులు అర్బటాలు లేకుండా ప్రజలు సంక్షేమం కోసం జగన్ పాటు పాటుపడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో దేవాలయాల తొలగించినప్ఫుడు మీ పార్టీ వ్యక్తే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు, అప్పుడు మీరు ఎందుకు మాట్లడ లేదు ? అని ఆయన ప్రశ్నించారు. 

దేవాలయాలను కూల్చే చంద్రబాబు మీకు దేవుడా ? అని ఆయన ప్రశ్నించారు. రథయాత్ర ఎందుకు చేస్తున్నారో మరోసారి ఆలోచించండి, షోషల్ మీడియాలో మతవిధ్వేశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. వరదలు తుఫాన్లు సమయంలో రాష్ట్రం సహయం చేస్తే కేంద్రం నుండి ఒక్క రూపాయి తీసుకు రాలేదన్న ఆయన రాష్ట్ర రైతులు సహయం పై మీకు బాధ్యత లేదా ? అని ప్రశ్నించారు. మీరు మతాలు ప్రాంతాలు మధ్య విధ్వేశాలు కలిగిస్తే ఈ ప్రాంత ప్రజలు సహించరని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: