మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. చాలా చోట్ల రక్త సంబంధీకులను కూడా చంపుకోవడానికి సిద్ధంగా సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా ఒరిస్సాలో మాత్రం కన్నకూతురిని తల్లి సుపారీ ఇచ్చి మరి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు చేసే పనులతో విసిగిపోయిన తల్లి ఆ కూతురిని మంచి మార్గంలో నడిపించేందుకు చాలా సార్లు ప్రయత్నాలు చేసింది. కానీ వక్ర మార్గంలో నడుస్తున్న కూతురికి అవేవి పట్టలేదు. దీంతో ఆ తల్లి చివరికి సుపారీ ఇచ్చి తన కూతురు ప్రాణాలు తీయించింది. అయితే ఆ తల్లి చేసిన పని చెడ్డది అయినా దాని వెనుక ఉన్న కారణం మాత్రం నలుగురిని ఆలోచింప చేస్తోంది. 


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో 50ఏళ్ల గిరికి 36 ఏళ్ల శివాని నాయక్ అనే కూతురు ఉంది. అయితే ఆమె కల్తీ మద్యం వ్యాపారం చేస్తోంది. తన కూతురు అమ్ముతున్న కల్తీ మద్యం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని తల్లి గ్రహించింది. ఎన్నోసార్లు ఈ పని మానేయమని కూతురిని ప్రాధేయపడింది. అయితే తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు వస్తుండడంతో తల్లి మాటలను కూతురు పెడచెవిన పెట్టింది.


అయితే తన కళ్ళ ముందే కల్తీ మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. కొంత మంది కొన్ని రోజులకే మరణిస్తూ ఉండడంతో ఆ తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా తన కూతురుని చంపాలని నిర్ణయించుకుని ముగ్గురితో ఒప్పందం కుదుర్చుకుంది. తన కూతుర్ని చంపేస్తే 50 వేలు ఇస్తానని చెప్పి అందులో 8000 అడ్వాన్స్ కూడా ఇచ్చింది. రంగంలోకి దిగిన సుపారీ గ్యాంగ్ ఈ నెల 12వ తేదీన శివాని హత్య చేశారు. అయితే పోలీసులు దర్యాప్తులో ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సుపారీ గ్యాంగ్ లో ఒక వ్యక్తి పట్టుబడగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇక చంపించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: