ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మత రాజకీయం జరుగుతుంది అనే మాట నిజం. రాజకీయంగా ఇప్పుడు మతం వ్యవహారం కాస్త సంచలనం అయింది. మతాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. రామ తీర్ధం ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా మతాలను అందుకున్న విషయం స్పష్టంగా అర్ధమైంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎస్సీ.. ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీల ను.. ఇప్పుడు క్రైస్తవ మిషనరీల ను బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి అని ఆయన విమర్శలు చేసారు. సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభం కలిసినంత మాత్రాన కాపుల ఓట్లు పడవు అని మండిపడ్డారు.

 రథయాత్రలు చేసినంత మాత్రాన హిందువులు ఓట్లు వేయరు అని అన్నారు. వాట్సాప్ లో ఫేస్బుక్ లో వార్తలు చూసి కేసులు పెడితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు ఆయన. 32 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేస్తున్నారు  అని కొనియాడారు . మత రాజకీయాలు చూసి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు అని వెల్లడించారు. విభజన హామీలు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిధులు ఎందుకు బిజెపిని సోము వీర్రాజు అడగడం లేదు అని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ భారత జనతా పార్టీ వారు మత రాజకీయాలు చేస్తున్నారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు అని అన్నారు. త్వరలో రాష్ట్రంలో కోటి మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కానీ అమరా వతి లోగాని ఏర్పాటు అని ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తాం అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: