ఎన్టీఆర్ ఘాట్ లో  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ , ఎల్. రమణ, రావుల, కంభంపాటి  తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు... ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చటమంటే మన సంస్కృతిని మనం‌ కూల్చుకోవటమే అని అన్నారు. కూల్చటం వంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలి అని ఆయన సూచించారు. ఎన్టీఆర్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్ళు పరుగెడతాయి అని అన్నారు.

ఎన్టీఆర్ కు భారతరత్న ఆలస్యమైన మాట వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి రాబోతోంది. అప్పటిలోగా భారతరత్న సాధిస్తాం అని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ కు బిరుదులు కొత్త కాదు.. ఆయన దేశానికే గర్వకారణం అని వెల్లడించారు. వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ టీడీపీ హయాంలోనే వచ్చింది అని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి గొప్పతనం వివరించారు.

ఎందరో పుడతారు కానీ.. మహానుభావులు కొందరే అని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప నటుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ అందగాడు.. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. తన పరిపాలనలో ఎన్టీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అని ఆయన వెల్లడించారు. హిందుపురం నియోజకవర్గంలో తాగు సాగు నీరుకు కారణం ఎన్టీఆర్  పథకాలే అని ఆయన పేర్కొన్నారు. తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానసపుత్రికలు అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు నిరుత్సాహం కలిగినప్పుడు ఎన్టీఆర్ పేరు స్మరించుకుంటే ఆవేశం ఉత్సాహం వస్తోంది అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కు జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలి అని కోరారు. కేసీఆర్ నాయకుడు కావటానికి ఎన్టీఆర్ ఏ కారణం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: